డయానా కోసం కొట్టుకున్నారు..

డయానా కోసం కొట్టుకున్నారు..

రెండు దశాబ్దాల క్రితం కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రిన్సెస్ డయానా అందానికి ప్రతిరూపం అంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.అందంతో మంత్రముగ్ధుల్ని చేసే ప్రిన్సెస్ డయానాను చూస్తే అలా శిలలైపోవడం తథ్యం.అందుకే సాధారణ యువకుల నుంచి ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారులైన హాలీవుడ్ హీరోలు సైతం ప్రిన్సెస్ డయానా కోసం కొట్టుకుచచ్చేవాళ్లు.అలా ప్రిన్సెస్ డయానా కోసం ఒకప్పటి హాలీవుడ్ హీరో సిల్వస్టెర్ స్టాలెన్,నటుడు రిచర్డ్ గేరేలు కొట్టుకున్న ఉదంతం తాజాగా వెలుగు చూసింది.ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో పాల్గొన్న హాలీవుడ్ సింగర్ ఎల్టన్ జాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ నుంచి విడిపోయిన అనంతరం లండన్లో వాల్ట్డిస్నీ అధినేత జెఫరీ కాట్జెన్‌బర్గ్‌ ఇచ్చిన ఓ విలాసవంత విందులో డయానా పాల్గొన్నారు.ఇదే విందుకు హాజరైన హాలీవుడ్ హీరో స్టాలెన్,నటుడు గేరేలు డయానాను కలవడానికి చాలా ప్రయత్నించారు.ఈ క్రమంలో పార్టీలో డయానా, గేరే నేరుగా ఓ ప్రత్యేక గదిలో కలుసుకొన్నారు.వారిద్దరిని చూస్తే ఆ గదిలో ఓ కొత్త వాతావరణం కనిపించింది.ప్రిన్సెస్ డయానాతో రిచర్డ్ గేరే ఫ్రెండ్ షిప్ చాలా క్లోజ్గా మారింది. ఇది చూసిన స్టాలెన్ అసూయతో రగిలిపోయాడు. డయానాకు చేరువయ్యేందుకు ప్రయత్నించాడు. పార్టీలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించాడు.ఇక ఆ పార్టీలో ఏర్పాటు చేసిన డిన్నర్కు గేరే, స్టాలెన్ హాజరుకాలేదు. కానీ దూరంగా ఆ విందులో ఇద్దరు కొట్టుకోవడం, గొడవపడటం కనిపించింది. ఆ గొడవ తీవ్రస్థాయికి వెళ్లి ముష్టిఘాతాలు కూడా చోటుచేసుకొన్నాయి. ఆ సందర్భంలో కొందరు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది అని ఎల్టన్ తెలిపారు.లండన్లో పార్టీ తర్వాత ఓ చలిమంట ముందు డయానా, రిచర్డ్ గేరే కూర్చొని కబుర్లాడుకోవడం కనిపించింది. ఆ గొడవ తర్వాత తీవ్ర ఆగ్రహంతో స్టాలెన్ ఇంటికి వెళ్లిపోయారని ఎల్టన్ తెలిపాడు.అటువంటి అనేక మధురస్మృతుల విషయాలకు గేరే పుస్తకరూపం కల్పించిన అక్టోబర్ 15న పుస్తకాన్ని విడుదల చేయనున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos