బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానిత సూసైడ్‌కు సంబంధించిన కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్లు, ముంబైలో విలువైన ఆస్తులు, కంపెనీల ఏర్పాటు లాంటి అంశాలపై నిశితంగా ప్రశ్నల వర్షం కురిపించగా వాటికి కొంత అసహనంతో సమాధానం చెప్పినట్టు వార్తలు వచ్చాయి.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు ఆదేశాలతో రియా చక్రవర్తి ఈడీ కార్యాలయానికి ఉదయం 11.50 గంటలకు చేరుకొన్నారు. అప్పటి నుంచి ప్రారంభమైన విచారణ రాత్రి 8.45 గంటల వరకు సాగింది. సుమారు 9 గంటలపాటు మనీలాండరింగ్, ఫెరా నిబంధనల ఉల్లంఘన, సుశాంత్‌తో రియా, ఆమె సోదరుడు షోవిక్ బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్ మేనేజర్ శృతి మోదీని కూడా ఈ కేసులో ప్రశ్నించారు.రియా చక్రవర్తి పన్ను చెల్లింపు పత్రాలు, పెట్టుబడులు, ఆదాయ వనరులు, బిజినెస్ డీల్స్, ప్రొఫెషనల్ డీల్స్ గురించి కూడా ఆరా తీసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అధికారుల పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారని, కొన్ని ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేయడం లాంటివి చేశారని పేర్కొన్నారు.జూలై 31వ తేదీన సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో దాఖలు చేసిన పిటిషన్‌లో రూ.15 కోట్లు బ్యాంక్ నుంచి బదిలీ అయ్యాయని ఆరోపించారు. ఈ క్రమంలో రాజ్‌పుత్ స్థాపించిన నాలుగు కంపెనీల గురించి ఈడీ అధికారులు సమాచారాన్ని అడిగి తెలుసుకొన్నట్టు తెలిసింది. అయితే రెండు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. మరో రెండు కంపెనీలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఉన్నాయి అని రియా చెప్పినట్టు తెలిసింది.విచారణలో రియాతోపాటు, ఆమె తండ్రి ఇంద్రజిత్, సోదరుడు షోవిక్ బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్ మేనేజర్ శృతి మోదీని ఈడీ అధికారులు ప్రశ్నించారు.మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు కొనుగోలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబివ్వకుండా మొండికేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈడీ దర్యాప్తులో భాగంగా అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా చక్రవర్తి సమాధానాలు చెప్పకుండా దాటవేసేందుకు ప్రయత్నించారని, అయితే అధికారులు అదే విధంగా ఆమెను పలు రకాల ప్రశ్నలతో జవాబు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.