రియా కాల్ డాటాలో సంచలన విషయాలు..

రియా కాల్ డాటాలో సంచలన విషయాలు..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో జరిగిన కుట్రలు దిగ్బ్రాంతికరంగా వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి లీలలన్నీ మరింత అనుమానాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సంచలనమైన రీతిలో రియా కాల్‌డేటాను బయట పెట్టింది. ఈ కాల్‌డేటాలో రియా చేసిన ఫోన్లు, సంప్రదించిన వ్యక్తుల వివరాలు షాకింగ్‌గా మారాయి.దిశ సలియాన్ మరణం తర్వాత రియా చక్రవర్తి, సుశాంత్‌ మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం తెలిసిందే. అయితే సుశాంత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత రియా తనతో దారుణంగా వ్యవహరించిందనే వార్తలు వచ్చాయి. సుశాంత్ కాల్ చేయగా అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసినట్టు కాల్ డేటాలో వెలుగు చూసింది. సుశాంత్ మరణానికి ముందు, తర్వాత రియా చక్రవర్తి ప్రవర్తన, పలువురు వ్యక్తులతో అనుసరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారాయి. సుశాంత్ మరణం తర్వాత ముంబై పోలీసు ఉన్నతాధికారితో రియా పలుమార్లు సంభాషించినట్టు టీవీ బయటపెట్టిన కాల్‌డేటాలో వ్యక్తమైంది. ఇటీవల కాలంలో దర్శకుడు మహేష్ భట్, శృతీమోడీ, తండ్రితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు సమాచారం.సుశాంత్ సింగ్ మరణం జూన్ 14వ తేదీన బయటకు వచ్చిన తర్వాత రియా చక్రవర్తి ముంబైలోని బాంద్రా డీసీపీతో టచ్‌లో ఉన్నారు. జూన్ 20 తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు నాలుగు సార్లు ఫోన్‌లో, ఒకసారి ఎస్సెమ్మెస్‌తో సంప్రదింపులు జరిపినట్టు కాల్‌డేటాలో స్పష్టమైంది.సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌తో రియా చక్రవర్తి 16 సార్లు మాట్లాడినట్టు స్పష్టమైంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బిజినెస్ మేనేజర్ శృతి మోడీతో 808 సార్లు సంభాషించినట్టు కాల్ డేటాలో రికార్డు అయింది. ఇక తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి‌తో ఏకంగా 1122 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు వెలుగులోకి వచ్చింది.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై విచారణ జరుగుతున్నప్పుడు రియా బాంద్రా డీసీపీ ఎందుకు ఎస్సెమ్మెస్ పంపారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు కోసం వారి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందనే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అనేక అంశాలు ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతున్నాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos