కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సందేశాత్మక చిత్రమట..

  • In Film
  • November 27, 2019
  • 162 Views

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ పరిణామాలు కథాంశంగా వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రంపై పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదు చేయగా మరికొంత మంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ స్పందించాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లుఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పారు. చిత్రంలో ఒక్క సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూపించలేదని అన్నారు. సినిమాను ప్రముఖ తండ్రీకొడుకులకు అంకితమిస్తానని చెప్పారు. మామూలు క్రైమ్ కంటే పొలిటికల్ క్రైమ్ ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుందని వర్మ అన్నారు. చిన్నప్పటి నుంచి తనకు గిల్లుడు అలవాటని చెప్పారు. తనకు ఆసక్తిగా ఉన్న అంశాన్నే సినిమాగా తీస్తానని తనదైన శైలిలోనే స్పందించాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos