ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు‘ చిత్రం విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరం చేశాడు.అందులో భాగంగా మంగళవారం మరో పోస్టర్ ను విడుదల చేశాడు.అదేవిధంగా బుధవారం ఉదయం 9.36 గంటలకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్– 2 విడుదల చేస్తానని ప్రకటించారు.తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆటో నడుపుతున్నట్లు ఉండడం గమనార్హం.సినిమా టైటిల్తోనే వేడి పుట్టించిన రామ్ గోపాల్ వర్మ… ఈ చిత్రంలోంచి పోస్టర్లను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు, నారా లోకేశ్ తో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు ఉన్న పోస్టర్ ను బాలల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.