మరింత వేడి పెంచిన ఆర్జీవీ..

మరింత వేడి పెంచిన ఆర్జీవీ..

ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పత్రిపక్షం వైసీపీతో పాటు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా తెదేపాను భయపెడుతున్నాడు.తెదేపా అధినేత చంద్రబాబు అసలు స్వరూపం ఇదేనంటూ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రానికి సంబంధించి వారానికో వీడియో విడుదల చేస్తూ తెదేపాలో గుబులు రేపుతున్నాడు.ఎంతలా అంటే చిత్రాన్ని చూడొద్దంటూ స్వయంగా చంద్రబాబే ప్రకటించేలా,చిత్రాన్ని విడుదల చేయనివ్వద్దంటూ తెదేపా నేతలు కోర్టును ఆశ్రయించేలా.తాజాగా వర్మ మరొక వీడియో విడుదల చేశారు.అయితే ఈ వీడియోలో వాయిస్‌ ఓవర్‌ చేస్తూ బాలయ్య,చంద్రబాబు మధ్య వాగ్వాదంగా మార్చి వదిలారు. బి బి సపోర్టింగ్ లక్ష్మీస్ ఎన్టీఆర్… సిబి అప్ సెట్ అంటూ బాలయ్య, చంద్రబాబు వాయిస్ మార్పింగ్ చేసిన ఫన్నీ వీడియోను వర్మ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.శాసనసభ సమావేశాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై చంద్రబాబు,బాలయ్యల మధ్య చర్చ జరిగినట్లు మార్ఫ్‌ చేసి వదిలిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.దీంతోపాటు వాడు,నా పిల్లలు నన్ను మోసం చేశారంటూ ఎన్టీఆర్‌ చెబుతున్న పోస్టర్‌ కూడా విడుదల చేశాడు వర్మ..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos