కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో కాక పుట్టిస్తున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు‘ అనే సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపాడు.ఈ సీక్వెల్ కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్‘ అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. మరోవైపు వర్మ సినిమా టైటిల్ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు‘ ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కులాల పేరుతో పెట్టే ఇలాంటి టైటిల్స్… ప్రజల మధ్య అంతరాన్ని పెంచుతాయని పలువురు విమర్శిస్తున్నారు.