అంచనాలు లేకుండా వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

అంచనాలు లేకుండా వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

హైదరాబాదు: కేజీఎఫ్ 2, ది కశ్మీర్ ఫైల్స్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్ 2’ చిత్రం బాలీవుడ్ లో చాలా మందికి నచ్చలే దన్నా రు. *సినిమాను చూసిన ఓ బాలీవుడ్ బడా దర్శకుడు తనకు ఫోన్ చేశాడు. అరగంట సినిమా చూసే సరికి బోర్ కొట్టిందని చెప్పాడు. అయితే వాళ్లకు నేను చెప్పేది ఒకటే. సినిమా నచ్చినా, నచ్చకపోయినా అది సాధించిన ఘన విజయాన్ని ఎవరూ కాదనలేరు. వాస్తవికతకు దూరంగా ఒక అసహజమైన రీతిలో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. రాఖీ బాయ్ మెషిన్ గన్ తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయి. ఇది నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పలేను. అయితే కొన్ని సన్నివేశాల్ని మాత్రం నోరెళ్లబెట్టుకుని చూశా. ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఒకటి. బాలీవుడ్ పట్టించుకోని ఒక దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం చాలా గొప్ప విషయం. నటీనటుల్లో అనుపమ్ ఖేర్ మాత్రమే అందరికీ తెలుసు. ఇలాంటి ఏ మాత్రం అంచనాలు లేని సినిమా రూ. 250 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. ఆ సినిమాకు సరైన స్క్రీన్ ప్లే లేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా సరిగా లేదు. అయినా ప్రేక్షకులు ఆదరించా రు. ఈ సినిమాను చూసినంత సీరియస్ గా గత 20 ఏళ్లలో ఏ సినిమాను చూసి ఉండర’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos