రెవిన్యూ ‘రద్దు’ పెద్ద కుట్ర

రెవిన్యూ ‘రద్దు’ పెద్ద కుట్ర

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఎత్తి వేయాలనే ఆలోచన వెనుక భారీ కుట్ర ఉందని భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రెవెన్యూ శాఖ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాస్పదంగా ఉందన్నారు.‘ అసలు ఆ శాఖను ఉంచాలనుకుంటున్నారా? తీసేయా లనుకుంటున్నారా? ఆ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలేమిటి? రెవెన్యూ శాఖను ఎత్తివేయాలనే ఆలోచన భారీ కుట్ర. ధరణి వెబ్సైట్ వెనుక చాలా కుట్రలు ఉన్నాయ’ ధ్వజమెత్తారు. కంప్యూట రీకరణ పేరుతో ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఐఎఫ్ఎల్ఎస్ సంస్థకు రెవెన్యూ రికార్డులను అప్పగించడమే పెద్ద మోసం అని విమర్శించారు. రెవెన్యూ శాఖ రద్దు సమాచారం బయటకు పొక్కితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్లను ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలిసిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos