కోల్కతా: కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆగస్టు 9న జరిగిన ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెద్దఎత్తున ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆస్పత్రికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసు వాహనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.