అమరావతి: రాష్ట్రం వెనుకబడిపోయిందని, రాజకీయ కక్ష సాధింపు విధానాలే ప్రధాన కార్యక్రమంగా పరిపాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఇక్కడి అగ్నిమాపక కేంద్రం వద్ద జరిగిన తెదేపా ఆందోళ నలో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ‘శాంతి భద్రతలు క్షీణించాయి. జగన్ మా పై దాడులు చే యిం చి సంతోష పడుతున్నారు. పరిపాలన వదిలేసి తమపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారు. తిరోగమన పాలన వల్ల పోలవరం జలాశయ నిర్మాణం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాలనలో సలహాదారులే చక్రం తిప్పుతున్నారు. వారికి ముడుపులు ముడితేనే ఏ పథకమైనా ముందుకు వెళుతుంద’ని ఆరోపించారు. అచ్చె న్నాయుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితర సీనియర్ నేతలు ధర్ణాలో పాల్గొన్నారు.