తెలంగాణలో కేసీఆర్ అరాచకపాలన అంతం చేయడానికి పోరాడుతున్న తనకు కామ్రేడ్ల మద్దతు ఎంతో అవసరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలిపారు.మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో సీపీఐ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి కేసీఆర్ పాలన అంతమొందించడానికి సహకరించాలన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి సహకరించి గెలిపించడానికి కృషి చేస్తామంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.బీజేపీని,తెరాసను ఓడించాలనే నినాదంతో ఎన్నికల్లో ముందుకు వెళతామని తప్పకుండా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తామన్నారు.ప్రధాని నరేంద్రమోదీ,సీఎం కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలని అరాచరకాలు,అక్రమాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి ఇప్పుడేమో ఒకరిపై ఒకరు విమర్శలు,ఆరోపణలు చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ జోకర్‌గా మిగలనున్నారని జాతీయ రాజకీయాలకు కేసీఆర్ పనికిరాడని కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలు అవసరం కూడా లేదన్నారు.ఎన్నికల్లో కేసీఆర్‌కు వేసే ప్రతీ ఓటు ప్రధాని మోదీకి వేసినట్లేనని 16 సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతా ఇంకేవో చేస్తాననంటూ బీరాలు పలుకుతున్న కేసీఆర్ గతంలో 12 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలిచినా ప్రలోభాలకు గురి చేసి బెదిరింపులకు పాల్పడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటూ కేసీఆర్ వింతరోగిలో ప్రవర్తిస్తున్నాడంటూ విమర్శించారు..
