మద్దతు కోసం తెజస తలుపు తట్టిన రేవంత్ రెడ్డి..

మద్దతు కోసం తెజస తలుపు తట్టిన రేవంత్ రెడ్డి..

గత ఏడాది డిశంబర్‌లో
జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెరాసలో చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి ఘోర
అవమానాన్ని మూటగట్టుకున్న టీపీసీసీ కార్యాధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో జరుగనున్న
ఎన్నికల్లో గెలిచి తెరాసపై పైచేయి సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో
మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.శాసనసభ
ఎన్నికల్లో ఓటమితో రగిలిపోతున్న రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలనే
కసితో వ్యూహాలు రచిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలంటూ మల్కాజ్‌గిరిలో
క్రీయాశీలకంగా ఉన్న సీపీఐ నేతలను కోరిన రేవంత్‌రెడ్డి తాజాగా తెలంగాణ జనసమితి చీఫ్‌
కొదండరామ్‌ను కూడా కలిశారు.సుమారు గంటసేపు కోదండరామ్‌తో చర్చించిన రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరిలో
సమస్యలపై పోటారం చేస్తున్న తమకు మీ మద్దతు కూడా ఎంతో కీలకమంటూ కోదండరామ్‌ను కోరారు.తనపై
ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి,వాటి నుంచి బయటపడడానికే కేసీఆర్‌ 16 సీట్లలో గెలవడానికి
యత్నిస్తున్నారన్నారు. అందుకే 16 సీట్లు తెరాసకు కట్టబెడితే కేంద్రం మెడలు వంచుతామని
ఇంకేదో చేస్తామంటూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.16 సీట్లు
కోరుకుంటోంది కేంద్రం మెడలు వంచడానికి కాదని 16 మంది ఎంపీలను బీజేపీ దాసోహం చేయడానికేనని
ఆరోపించారు.మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్న నేపథ్యంలో మద్దతు
ఇవ్వాలంటూ కోదండరామ్‌ను కోరామన్నారు.ఈ విషయంపై కోదండరామ్‌ మాట్లాడుతూ..సమస్యలపై,ప్రభుత్వ
అసమర్థత,అక్రమాలపై ప్రశ్నించే గొంతులు ఉండాలని రేవంత్‌రెడ్డికి మద్దతిచ్చే విషయంపై
పార్టీలోని ఇతర నేతలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామన్నారు.గతంలో రాష్ట్రానికి సంబంధించి
పలు అంశాలను కాంగ్రెస్‌ విభజన చట్టంలో పొందుపరిచిందని అవన్నీ నెరవేరాలంటూ కేంద్రంలో
కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ఇక లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ జరసమితి
రెండు లేదా మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయనుందని మిగిలిన అన్ని
నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కే మద్దతివ్వడానికి నిర్ణయించుకున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos