‘మా స‌హ‌నాన్ని ప‌రీక్షించకూడ‌దు’

హైదరాబాదు: పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేపడుతోన్న చలో రాజ్భవన్ ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటు న్నందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘మేము శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తాం. ధర్నాచౌక్ నుంచి రాజ్భవన్ వరకు ప్రదర్శనకు అనుమతి ఇవ్వాల్సిందే. ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోబోము. అరెస్టు చేసిన వారిని పోలీసులు వెంటనే విడిచిపెట్టాలి. శాంతియుత నిరస నలను ఇలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చిఆందోళన నిర్వహిస్తారు. ఎంత మందిని అరెస్టు చేయించినా మా నిరసన కొనసాగుతుంది. పెట్రోల్, డీజిల్ పన్నులను పెంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి. ప్రజల ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేందుకు వెను కాడబోమ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos