గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌

గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌

గోల్కొండ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశ పౌరులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహానుభావుల త్యాగాలతో స్వాతంత్య్రం సాధించామన్నారు. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందన్నారు. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలంగా ఉందన్నారు. బీహెచ్ఈఎల్, మిధాని వంటి పరిశ్రమలను స్థాపించారన్నారు. లాల్బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ సాగులో విప్లవం తెచ్చారన్నారు. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలు ఇవి కొన్ని ఉదాహరణలేనన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos