అహ్మదాబాద్:భాజపా ఒక మార్కెటింగ్ కంపెనీ అని పాటిదార్ ఉద్యమ నాయకురాలు రేష్మా పటేల్ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో జరిగిన పాటేదార్ ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన రేష్మా పటేల్ గతంలో భాజపాలో చేరారు. నేతల వ్యవహార శైలితో విభేదించిన రేష్మా తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం గుజరాత్ భాజపా అధ్యక్షుడు జితు వాఘానికి సమర్పించారు. భాజపా కేవలం మార్కెటింగ్ కంపెనీ అని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అసత్యపు విధానాలను, అసత్యపు పథకాలను మార్కెట్ చేస్తూ ప్రజలను వెర్రివాళ్లను చేయడంపై తమకు శిక్షణ ఇచ్చారని ఆరోపించారు.