అమలాపురం : ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘అంటరానితనం నిర్మూలనకే రిజర్వేషన్లు. కులపరమైన అసమానతలను తగ్గించేందుకు రిజర్వేషన్లు ఉపకరిస్తాయి. కొలీజియం వ్యవస్థ వల్ల దళితులు న్యాయమూర్తులు కావడం లేదు. దేశ న్యాయ వ్యవస్థలో కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టం. ఈ లోపాల కారణంగా అగ్రవర్ణాల వారు శిక్షల నుంచి తప్పించుకోగలుగుతున్నారు. న్యాయమూర్తులు రిజర్వేషన్లపై మాట్లాడేముందు కొలీజియం వ్యవస్థలను చక్కదిద్దాల’ని హితవు పలికారు.