పూణె: ‘ఏదైనా ఒక వివాహ బంధం విఫలం అయిందంటే, ఇద్దరి మధ్య అవగాహన లేకపోవడమేన’ని నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ వీడియోలో వ్యాఖ్యానించారు. తమ వివాహం విఫలం కావడంపై ఆమె గతంలోనూ చాలా సార్లు స్పందించారు. నాగబాబు కుమార్తె వివాహం జరుగుతున్న రోజునే ఈ వీడియోను విడుదల చేయడంతో అది సంచలనమైంది. జీవిత భాగస్వామితో సంబంధాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుందన్నారు. భర్తలు సవ్యంగా వ్యవహరించ పోయినా వారితో మంచిగా ఉండేందుకే మగువలు ప్రయత్నిచటం భారతీయ మహిళలకు అలవాటై పోయింది. ఏ వివాహమైనా తెగిందంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. దాన్ని కర్మ అని కూడా అనుకోవచ్చు. పరిస్థితులకు అను గుణంగా ముందడుగు వేయాల’ని భావోద్వేగ వ్యాఖ్యలు చేసారు. ‘అందరి ఆశీర్వాదంతో కొత్త జంట జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటు న్నాన’ని పేర్లు ప్రస్తావించకుండానే నిహారిక, చైతన్య దంపతులను ఆశీర్వదించారు. ‘కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వేళ ఎంతో చీకటిగా అనిపి స్తుంవొ. ఆ చీకటి నుంచి మానసిక దృఢత్వం, స్వయంకృషితోనే బయటకు రావాలి. ఎవరో వచ్చి సాయం చేస్తారని అనుకోవద్దు. వారు సాయం చేసి నా, ఎవరికి వారే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి వుండాల’ని సూచించారు.