కోడికత్తి నిందితుడికి 25 వరకు రిమాండ్‌

  • In Crime
  • January 11, 2019
  • 241 Views
కోడికత్తి నిందితుడికి 25 వరకు రిమాండ్‌

విజయవాడ: జగన్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 25 వరకూ రిమాండ్‌ విధించారు. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావును కస్టడీకి కోరుతూ ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచి నిందితుడిని విజయవాడ సబ్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించడంతో నిందితుడిని సబ్‌జైలుకు తరలించారు. కస్టడీ పిటిషన్‌పై ఈ సాయంత్రంలోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఎన్‌ఐఏ కోర్టు ఇన్‌ఛార్జిగా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వ్యవహరిస్తుండడం వల్ల నిందితుడు శ్రీనివాసరావును ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos