మాజీ ఎమ్మెల్సీలకు ఊరట..

మాజీ ఎమ్మెల్సీలకు ఊరట..

తమను అన్యాయంగా పదవి నుండి తొలగించారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు మాజీ ఎమ్మెల్సీకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఎన్నికల నోటీఫికేషన్‌ విడుదల చేయకూడదని హైకోర్టు ఆదేశించింది.గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్‌ నుండి ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాముల్ నాయక్‌లపై అనర్హత వేటు పడింది.కనీసం తమ అభిప్రాయాలను కూడ పరిగణనలోకి తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్సీలు  భూపతి రెడ్డి, యాదవరెడ్డిలు హైకోర్టు‌ను ఆశ్రయించారు.ఈ నెల 15వ తేదీ లోపుగా  ఎలాంటి ఎన్నికల నోటీఫికేషన్‌ను విడుదల చేయకూడదని హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నెల 15వ తేదీన ఈ విషయమై మరోసారి కోర్టు విచారణ చేయనుంది. నిజామాబాద్‌ స్థాని సంస్థల నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి,ఎమ్మెల్యే కోటాలో యాదవరెడ్డిలు విజయం సాధించారు.అయితే ఈ ఇద్దరు నేతలతో పాటు రాములు నాయక్‌ కూడా ఫిరాయింపులకు పాల్పడ్డారని ముగ్గురిపై చర్యలు తీసుకోవాలంటూ తెరాస మండళికి ఫిర్యాదు చేయడంతో మండళి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ముగ్గురిపై అనర్హత వేటు వేశారు.దీంతో తమపై అన్యాయంగా అనర్హత వేటు వేశారంటూ భూపతి,యాదవరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. భూపతి, యాదవరెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని తమ వాదన వినకుండా సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా మండళి నిర్ణయం తీసుకుంటందంటూ భూపతి,యాదవరెడ్డిల తరపు న్యాయవాది వాదించారు.వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 15వ తేదీ లోపుగా  ఎలాంటి ఎన్నికల నోటీఫికేషన్‌ను విడుదల చేయకూడదని హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.దీంతోపాటు సభ్యత్వం రద్దుకు సంబంధశించి రికార్డులు సమర్పించాలంటూ మండళిని ఆదేశించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos