ఢిల్లీ : ముఖ్యమంత్రి రేఖాగుప్తా పై గతవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. తన అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతుండగా సీఎం దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌భాయ్ సకారియా ని అరెస్ట్ చేశారు. అయితే విచారణ సందర్భంగా తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంపై కత్తితో దాడి చేసేందుకు తొలుత నిందితుడు ప్లాన్ చేసినట్లుగా తెలిసింది.