ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం కాస్త కోలుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నలభై నిముషాల ప్రాంతంలో సెన్సెక్స్ 265 పాయింట్లు పెరిగి 38,459 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 11,351 వద్ద ఉన్నాయి. ఎన్ఎస్ఈలో ఫార్మా 0.15 శాతం బలహీనపడింది. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఆటో, ఐటీ 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ లో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, యాక్సిస్, గెయిల్, ఐసీఐసీఐ, ఎంఅండ్ఎం 3.4-1 శాతం మధ్య లాభపడ్డాయి. యూపీఎల్, ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా 1-0.25 శాతం మధ్య తగ్గాయి.