ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ వారం కోలుకున్నాయి. ఉదయం 9.55గంటల వేళకు నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12,159 వద్ద, సెన్సెక్స్ 159 పాయింట్లు ఎగబాకి 41,314 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.12 వద్ద దాఖలైంది. హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, యూపీఎల్, హీరో మోటార్‌కార్ప్, ఎంఅండ్ఎం, గ్రాసిమ్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, యస్ బ్యాంక్ షేర్లు లాభాల్ని గడించాయి. నెస్లే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, వేదాంత, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్ట పోయాయి.