ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 12వ సీజన్‌లో మరిన్ని రికార్డులను సృష్టిస్తాడని అభిమానులు గట్టి విశ్వాసంతో ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించిన కోహ్లీ ఐపీఎల్‌లో ప్రధానంగా మూడు రికార్డులకు చేరువగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సురేశ రైనా ప్రథమ స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రైనా ఆడుతున్నాడు. అతను 176 మ్యాచుల్లో 4,985 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ 163 మ్యాచుల్లో 4,948 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 52 పరుగులు చేస్తే కోహ్లీ ఐపీఎల్‌లో అయిదు వేల పరుగుల మైలురాయిని అధిగమిస్తాడు. అత్యధిక అర్ధ శతకాలు చేసిన ఆటగాడుగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ రికార్డు 39 అర్ధ శతకాలతో డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ 52 పరుగులు చేస్తే, ఒకే సారి మూడు రికార్డులు అతని పేరిట దఖలు పడతాయి.