ఆర్థికమాంద్యం దిశగా అమెరికా.. ఇండియాపై ప్రభావం!

ఆర్థికమాంద్యం దిశగా అమెరికా.. ఇండియాపై ప్రభావం!

న్యూ ఢిల్లీ: త్వరలోనే అమెరికా తీవ్ర ఆర్థికమాద్యంలోకి జారుకోబోతోందని ఇండియన్ టాప్ ఎకనామిస్టుల్లో ఒకరైన యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ్ మిశ్రా హెచ్చరించారు. ఇది ఇండియన్ జీడీపీలో ప్రధాన భాగమైన సర్వీస్ సెక్టార్, ఇండియన్ బాండ్, ఈక్విటీ మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. యూఎస్ ఆర్థిక లోటు ఆ దేశ జీడీపీలో ఈ ఏడాది మరో 4 శాతం పెరిగిందని చెప్పారు. ఒకవేళ వచ్చే ఏడాది అమెరికా తన ఆర్ఠిక లోటును స్థిరంగా ఉంచినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యలోకి వెళుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక లోటు ఎక్కువగా ఉండటంతో యూఎస్ బాండ్లు కొనేందుకు ఎవరూ వేచి చూడటం లేదని చెప్పారు.
పర్యవసానంగా నెమ్మదించిన దేశ సేవారంగా ప్రగతిని మరింత దెబ్బ తీస్తుందన్నారు. ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, బిజినెస్ సర్వీసెస్ ఎగుమతులు దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. జీడీపీ 1 శాతం వృద్ధి రేటును కోల్పోతుందని తెలిపారు. వస్తు ఎగుమతులకు డిమాండ్ పడిపోతుందని తెలిపారు. ఇప్పటికే చైనా, జపాన్, యూరోపియన్ దేశాల ఎగుమతులపై ప్రభావం ప్రారంభమయిందని చెప్పారు. ఈ దేశాలన్నీ వాటి ఉత్పత్తులను ఇండియాలో డంప్ చేస్తాయని తెలిపారు. ఇది మన దేశ కంపెనీలపై ప్రభావం చూపుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos