అవిశ్వాసాన్ని ఎదుర్కొంటాం..

అవిశ్వాసాన్ని ఎదుర్కొంటాం..

 కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి అంతకంతకు దిగజారుతున్నా సీఎం కుమారస్వామితో పాటు ఇతర మంత్రుల్లో మాత్రం ప్రభుత్వం నిలబడుతుందనే ఆశలు ఎక్కడో మిగిలిఉన్నాయి.16 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు స్పీకర్‌ వద్ద ఉండడంతో రాజీనామాలపై స్పీకర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠత పెరిగిపోతోంది.మరోవైపు నేటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కుమారస్వామి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది.ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎదుర్కోవడానికి మార్గాలు,సమావేశాల్లో బీజేపీ అవిశ్వాస తీర్మానం పెడితే ఏవిధంగా గట్టెక్కాలనే అంశాలపై చర్చించారు.అనంతరం గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ మాట్లాడుతూ..సభలో విపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టినా గట్టేక్కుతామని .. బెంగ పడాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ఇప్పటికీ ఏడుసార్లు ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నించిందని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నిరంతరాయంగా పనిచేస్తుందని ఆరోపించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మండిపడ్డారు. ఇవాళ్టి కన్నా ఇదివరకు ఇంకా గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నామని వివరించారు. సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ ధైర్యంగా వారిని ఎదుర్కొందని గుర్తుచేశారు.ఇక 16 కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో బీజేపీ సంఖ్యాబలం 107 కు చేరుకుంది.ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos