బెంగళూరు : తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ ఆర్‌సిబి హైకోర్టులో సోమవారం ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. గత బుధవారం నగరంలో జరిగిన ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు విజయోత్సవంలో సంభవించిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది గాయపడ్డారు. దరిమిలా పోలీసులు ఆర్‌సీబీ, కర్ణాకట క్రికెట్ అసోసియేషన్ , ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేసారు. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌ఎల్) తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ అయిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణ ఈనెల 13 న జరగనుంది.