రాయపాటిపై సీబీఐ దాడి

రాయపాటిపై సీబీఐ దాడి

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మాజీ సభ్యుడు, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసం, కార్యాలయాలపై మంగళవారం సిబీఐ దాడుల్ని ప్రారంభించింది. హైదరాబాద్, గుంటూరు లోని ఆయన ఇల్లు, కార్యాలయాలు, ట్రాన్స్ ట్రాయ్ సంస్థలో సోదాల్ని చేపట్టారు. రాయపాటి భాగస్వామి అయిన ట్రాన్స్ ట్రాయ్ పోలవరం గుత్తేదారు. సబ్ కాంట్రాక్టు ద్వారా పోలవరం పనులను ఆ సంస్థ కొనసాగించింది. తమ బకాయిల్ని చెల్లించడంలేదని ఇండియన్ బ్యాంకు చేసిన ఫిర్యాదు సీబీఐకి బదిలీ కావటంతో దాడుల్ని చేపట్టింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన రాయపాటి సాంబశివ రావు, ఐదు సార్లు లోక్ సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి, నరస రావు పేట లోక్సభ స్థానంలో గెలిచారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడారు. అనారోగ్యం వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలోనూ పలు బ్యాంకులు రాయపాటి సంస్థలపై ఫిర్యాదు చేశాయి. ఆపై రామ్ మాధవ్ సహా పలు వురు బీజేపీ నేతలు రాయపాటి ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో ఆయన బీజేపీలో చేరుతారన్న వ్యాఖ్యలు వచ్చాయి. ఆయన మాత్రం బీజేపీలో చేరలేదు. సీబీఐ దాడులు జరుగుతుండటం చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos