రాయపాటి రాక తెలియదు

రాయపాటి రాక తెలియదు

విజయవాడ: తెదేపా లోక్సభ మాజీ సభ్యుడు రాయపాటి సాంబశివ రావు , పలువురు శాసనసభ్యులు భాజపాలో చేరనున్న సమాచారం తనకు తెలిదని ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అయితే తమ పార్టీలో చేరేందుకు పార్లమెంటు, శాసనసభ మాజీ సభ్యులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత ,శ్రావణ మాసంలో చాలా మంది తమ పార్టీ తీర్థాన్ని పుచ్చుకుంటారని తెలిపారు. పోలవరం ముంపు మండలాల నేతలు కూడా తమ పార్టీలోకి వచ్చారన్నారు. తమ నేతలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు పోరాటాలు కొనసాగిస్తా మన్నారు. ఇసుక కొరత నివారించటంలో ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. వివిధ సమస్యల పరిష్కారానికి జగన్‌కు లేఖలు రాసినా ఫలితం లేదని ఆరోపించారు. రాజకీయ పక్షం అధ్యక్షుడు రాసిని లేఖలకు స్పందించడం నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు.రెండ్రోజుల కిందట రాయపాటి సాంబశివరావును భాజపా నేత రాంమాధవ్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత రాయపాటి కూడా తాను భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీని గురించి తనకేమీ తెలియదని కన్నా పేర్కొనటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos