ముంబై : శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయం త్రం ప్రమాణం చేయనున్నారు. ఇందుకు అనువుగా శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల్ని త్యజించారు. ప్రస్తుతం ఆ పత్రిక కార్యనిర్వాహక సంపాదకుడి సీనియర్ నేత సంజయ్ రౌత్ సంపాదక బాధ్యతల్ని చేపట్టారు. సామ్నా పత్రికను 1988లో బాల్ ఠాక్రే స్థాపించారు. ప్రమాణస్వీకారోత్సవ వేదిక శివాజీ ఉద్యాన వనంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ పార్టీలనుంచి ప్రముఖ నేతలు దీనికి హాజరుకానున్నారని సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈ రోజు చరిత్రాత్మకమైన దని అభివర్ణించారు. కొత్త ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీలకు చెరి 15, కాంగ్రెస్ పార్టీకి 13 మంత్రి పదవుల్ని కల్పించనున్నట్లు సమాచారం.