నెల్లూరు: ఢిల్లీ లోని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ తో బుధవారం నెల్లూరు లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర రెడ్డి భేటీ అయ్యారు. అంతకు ముందు రవిశంకర్ ఆధ్యాత్మికత, రాజకీయాల మధ్య సమన్వయం గురించి అక్కడ సమావేశమైన ప్రజాప్రతినిధులకు వివరించారు. తదుపరి వారి సందేహాల్ని నివృత్తి చేశారు.