నల్లజర్ల : నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో మంగళవారం రాత్రి రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఘంటవారిగూడెంలో యువతులతో అస్లీల నృత్యాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ ఆదేశాల మేరకు నల్లజర్ల సిఐ బాలసౌరి దేవరపల్లి సిఐ నాయక్ తమ సిబ్బందితో దాడి చేసి 23 మంది పురుషులను ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. గత ఏడాది ఇదే గెస్ట్ హౌస్ లో ఇదే తరహాలో జరుగుతుండగా పోలీసులు దాడి చేసి అప్పట్లో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా వెస్ట్రన్ మొజులో పడి యువత పెడదారి పట్టి ఇటువంటి సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి నరసింహ కిషోర్ తెలిపారు. ఈ దాడిలో 23 మంది పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఏడు కార్లు, పదివేల రూపాయల నగదు, మూడు విస్కీ బాటిల్స్, 20 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ తెలియజేశారు.