డెహరాడూన్: మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కొవిడ్-19 వ్యాధి పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కరోనా వైరస్ కూడా మనలాంటి జీవేనని పేర్కొన్న ఆయన.. మనలాగే కరోనా కూడా జీవించాలనుకుంటుంది కదా అని ఎదురు ప్రశ్నించారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మారుస్తోందని సరికొత్త భాష్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపట్టారు.