6 ఎలుకలు..రూ.200

6 ఎలుకలు..రూ.200

చెన్నై: కరువు కోరల్లో విలవిలలాడుతున్న తంజావూరు జిల్లా కుంభకోణం పరిసర గ్రామాల్లో ఎలుక మాంసం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కరవు తాండవిస్తున్నందున పొలాలు బీడుగా మారాయి. దీంతో అక్కడ ఎలుకల సంచారం ఎక్కువగా ఉంది. కొందరు వీటిని తమ ఉపాధిగా మలచు కున్నారు. ఎలుక లను పట్టుకొని రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. నీలత్తనల్లూర్, ఆవూర్ ప్రాంతాల్లో ఎలుక మాంసం ఎక్కువగా అమ్ముడ వుతోంది. ఎలుక మాంసంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని నమ్మబలికి అమ్మేస్తున్నారు. ఆరు ఎలుకల ధర రూ.200. పంట పొలాల్లో లభించే ఎలుకల మాంసం బాగుంటుందని ఇతర ప్రాంతాల ప్రజలు లొట్టలేసుకుని వచ్చి కొంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos