అభిమానులతో కలసి థియేటర్‌లో రష్మిక సందడి..

  • In Film
  • January 11, 2020
  • 156 Views
అభిమానులతో కలసి థియేటర్‌లో రష్మిక సందడి..

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్లో భాగంగా.. ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులతో కలిసి సినిమా చూస్తానని మాటిచ్చింది రష్మిక మందన్న. ఇచ్చిన మాట ప్రకారమే రోజు ఉదయం హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ వెళ్లి అందరి మధ్య సినిమా చూసింది.శ్రీరాములు థియేటర్లో రష్మిక సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. రష్మిక థియేటర్కు రావటం గమనించిన అభిమానులు పెద్దఎత్తున జై మహేష్ బాబు, జై రష్మిక అంటూ నినాదాలు చేశారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. దీంతో థియేటర్ ప్రాంగణమంతా సందడి సందడిగా మారింది.రష్మిక మందన్నను చూడగానే ఆమెను జనం చుట్టుముట్టటంతో.. కొద్దిసేపు గందరగోళ వాతావరణం కనిపించింది. ఒకదశలో ప్రేక్షకులు, అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి ఇబ్బందికరంగా మారింది. చివరకు రష్మికను థియేటర్‌లోకి తీసుకెళ్లి అభిమానుల మధ్య కూర్చోబెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos