సాలే.. ఇక్కడెందుకురా ఉన్నావ్.

  • In Film
  • February 16, 2019
  • 175 Views
సాలే.. ఇక్కడెందుకురా ఉన్నావ్.

జమ్ము, కశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడి ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. పైశాచిక దాడిని ప్రతీ ఒక్కరు నీచమైన ఘటనగా అభివర్ణిస్తూ పాకిస్థాన్ అనుకూల వర్గంపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పుల్వామాలో సైనికులపై ఉగ్రదాడి అనంతరం క్రికెటర్, రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇతర వ్యక్తులు ఉగ్రదాడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి వ్యక్తులను యాంకర్ రష్మీ చీల్చి చెండాడారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది. ఉగ్రదాడికి జాతి బాధ్యత వహించదు. ఉగ్రవాదులకు మతం, కులం, వర్గం లేదు అని సిద్ధు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే ఓ నెటిజన్ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ చేసిన వ్యాఖ్యలపై రష్మీ మండిపడ్డారు.
నీ పాకిస్థాన్‌ గొప్పతనం ఏంటిరా? సాలే మావాడివి అయిపోయావు కాబట్టి బతికి బయటపడ్డావు. మాతోనే మీ అస్థిత్వం. లేకపోతే నువు దానితో సమానం. మూసుకొని కూచో అంటూ రష్మీ ఫైర్ అయింది. దేశ విభజన సమయంలో అవతలి వైపు వెళ్లాల్సింది. కానీ మన దురదృష్టం కొద్ది ఈ దేశంలో ఉన్నాడు అని అన్నారు.

సాలే.. మా వాడివి అయిపోయావ్ కాబట్టి

పాకిస్థాన్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చేవారిని ఎలా సమర్ధిస్తావు. ఈ దేశానికి నీ ముఖం ఎలా చూపించుకొంటావ్. పాకిస్థాన్‌ కెళ్లి ఎలుక పొక్కలో ముఖం పెట్టుకో పో. దేశవ్యతిరేక విధానంతో సిగ్గుమాలిన చర్య అంటూ రష్మీ ధ్వజమెత్తింది.

పాక్‌కు వెళ్లి ముఖం అక్కడ పెట్టుకోమని

పుల్వామా దాడి ఘటన తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ విద్యార్థి చేసిన వ్యాఖ్యలపై రష్మీ స్పందించింది. ఇలాంటి వాళ్లను ఆనవాళ్లు లేకుండా ఈ నా కొడుకులను ఏరి పారేయాలి అంటూ రష్మీ స్పందించారు. ఉగ్రసంస్థ జైష్ దాడి గ్రేట్ అంటూ అలీగఢ విద్యార్థిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. అతడిపై ఐటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

నా కొడుకులను ఏరి పారేయండి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos