చెన్నై: ‘తమిళ నాడును తమిళుడే పాలించాలి. రాష్ట్రేతరులు పాలించడాన్ని అడ్డుకుంటామ’ని నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ హెచ్చరించారు. రజనీకాంత్ కనుక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే దాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. రాష్ట్రంలోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలను ప్రజలు తిరస్కరించాలని పిలుపు నిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలు కావటాన్ని ప్రజట ఓటమిగా అభివర్ణించారు. తాను చదువుకోకపోయినా ఇతరుల చదువు కోసం శ్రమించిన కామ రాజ్ నాడార్ వంటి నాయకులు ఇప్పుడు లేరని సీమాన్ అన్నారు.