కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే

కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే

పాటియాలా : అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్ ప‌త‌న్‌ మ‌జ్రాను మంగళవారం పోలీసులు ఇక్కడ అరెస్టు చేశారు. ఆయన్ను  ఠాణాకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ఎమ్మెల్యే సహాయకులు అడ్డుకుని పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడినట్లు తెలిసింది. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే రెండు వాహనాల్లో అక్కడి నుంచి పరారు కాగా పోలీసులు వారిని వెంబడించి ఓ వాహనాన్ని పట్టుకున్నారు. అయితే, అందులో ఎమ్మెల్యే లేరు. వేరే వాహనంలో పారిపోయారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. స‌నౌర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్ అరెస్టుకు ముందు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఓ పాత ఘ‌ట‌న‌కు సంబంధించి త‌న‌పై రేప్ కేసు న‌మోదు చేసిన‌ట్లు ఆ వీడియోలో చెప్పాడు. పంజాబ్ పోలీసులు త‌న‌పై ఐపీసీ 376 కింద కేసు బుక్ చేశార‌న్నారు. త‌న మాజీ భార్య ఆ కేసులో ఉన్న‌ట్లు తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ బృందం త‌న‌పై పెత్త‌నం చెలాయిస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే ఆరోపించారు. త‌న గొంతు నొక్కే ప్రయ‌త్నం జ‌రుగుతుంద‌న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos