మరో ప్రేమజంటపై దాడి….

గుంటూరు జిల్లాలో ప్రియుడే పథకం ప్రకారం ప్రియురాలిని హత్య చేయించిన ఘటన మరువక ముందే అదేరీతిలో పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండంలో చోటు చేసుకుంది.మండలంలోని గంటుపల్లి బౌద్ధరామాలకు వచ్చిన ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో యువతి మృతి చెందగా యువకుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రఖ్యాత పర్యాటక స్థావరం గుంటుపల్లి బౌద్ధారామాలకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. అదే రీతిలో సుమారు 40 మంది పాఠశాల విద్యార్థులు బౌద్ధారామాలను దర్శించడానికి ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు. వారితోపాటు మూడు జంటలు కొండపైకి వెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కొంతసేపటికి విద్యార్థులు, రెండు జంటలు తిరిగి వెళ్లిపోయాయి. ఓ యువతి, యువకుడు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూసేసరికి యువతి తీవ్ర గాయాలతో మృతిచెంది ఉంది. ఆమె పక్కనే యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహం చుట్టూ ఉన్న మొక్కలకు సైతం రక్తపు మరకలు అంటడం, యువతి తీవ్ర గాయాలతో దుస్తులు లేకుండా మృతిచెంది ఉండటంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. యువకుడు నవీన్‌ భీమడోలు మండలం అజ్జావారిగూడేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం. యువతి మృతదేహం వద్ద యువకుడు గాయాలతో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos