అరుణాచల్ సీఎం లైంగిక దాడికి పాల్పడ్డారు

  • In Crime
  • March 14, 2019
  • 185 Views
అరుణాచల్ సీఎం లైంగిక దాడికి పాల్పడ్డారు

సుప్రీం కోర్టుకు యువతి ఫిర్యాదు

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ ఖండూ పదేళ్ల కిందట తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 26 ఏళ్ల యువతి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడామెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఉదంతంపై రాజధాని ఇటానగర్‌లో ఆమె నాలుగేళ్ల కిందట ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఆమెతో పాటు కుటుంబానికీ బెదిరింపులు వస్తున్నాయి. తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉన్నందున పోలీసు రక్షణ కల్పించాలని ఆమె కోర్టుకు విన్నవించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం…2008 జులైలో సరిహద్దు జిల్లా తవాంగ్‌లో ఫుర్మ లామా అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ సర్క్యూట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు పేమ ఖండూ. సాయుధ బలగాల్లో ఆయన కల్నల్‌గా పని చేస్తున్నారు. కొద్ది సేపు తర్వాత మత్తు మందు కలిపిన శీతల పానీయాన్ని ఆమెకిచ్చారు. తాగిన కొద్ది సేపటికి స్పృహ కోల్పోయింది. తర్వాత నలుగురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చేసరికి నగ్నంగా ఉంది. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ ఖండు ఆమె చెంపపై కొట్టాడు. తర్వాత 2012లో ఆమె ఖండూను చూసింది. అప్పటికి అతను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నాడు. తనపై లైంగిక దాడికి పాల్పడింది ఇతనే అని ఆమె గుర్తుకు తెచ్చుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos