స్నేహితుడి పుట్టినరోజు వేడుక యువతి జీవితంలో చీకట్లు నింపింది.స్నేహితుడి
ఆహ్వానం మేరకు పార్టీలో పాల్గొనడానికి స్నేహితుడి గదికి వెళ్లగా యువతిపై రూమ్‌మెట్
అత్యాచారానికి పాల్పడ్డ ఘటన బెంగళూరు నగరంలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి చెందిన యువతి(24)బెంగళూరు నగరంలో ఎంబీఏ చదువుతున్నారు.యువతి చదువుతున్న
కాలేజీలోనే చదువుతున్ అరీఫ్ అనే యువకుడు శనివారం తన పుట్టినరోజు కావడంతో యువతిని పార్టీకి
ఆహ్వానించాడు.తెలిసిన వ్యక్తే కావడంతో యువతి పార్టీకి వెళ్లగా తనతో పాటు గదిలో ఉంటున్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన ఆదిత్యను పరిచయం చేసాడు.అనంతరం ముగ్గురు కలసి
మద్యం పూటుగా మద్యం సేవించారు.కొద్ది సేపటి అనంతరం ఆహారం తెస్తానంటూ ఆరీఫ్ బయటకు వెళ్లగా
కొద్దిగా విశ్రాంతి తీసుకుంటానని యువతి గదిలోకి వెళ్లారు.అయితే మద్యం మత్తులో ఉన్న
ఆదిత్య యువతిని లైంగికంగా వేధించసాగాడు.యువతి కూడా మద్యం మత్తులో ఉండడంతో ఆదిత్యను
ఎదురించలేకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టి అక్కడి నుంచి పారిపోయాడు.కొద్ది సేపటి అనంతరం
గదికి వచ్చిన అరీఫ్‌కు జరిగిన విషయాన్ని తెలపగా మరుసటి రోజు స్నేహితుడు అరీఫ్‌తో కలసి
పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు
నిందితుడిని అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టారు. అదంతా జరిగాక తన మిత్రుడు ఆరిఫ్ సూచన
మేరకు కేసు విత్ డ్రా చేసుకుంటానని మళ్లీ ఠాణా మెట్లెక్కింది బాధితురాలు. అయితే
FIR నమోదు చేయడంతో అది కుదరని తేల్చి చెప్పారు పోలీసులు. చట్ట ప్రకారం బాధితురాలిని
మెడికల్ టెస్టుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ ద్వారా మొదలైన ఈ పరిచయం చివరకు
ఇలాంటి పరిస్థితికి దారి తీసింది. ఆ యువతిది కూడా ఆంధ్రప్రదేశ్ కావడంతో.. ఒకటే రాష్ట్రమని
తొందరగా దోస్తీ కుదిరినట్లుంది. అయితే పోలీసుల దర్యాప్తులో ఆదిత్య తన తప్పు ఒప్పుకున్నాడు.
మద్యం మత్తులో అలా జరిగిందని చెప్పుకొచ్చాడు.