ప్రియుడిని కొట్టి…ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

  • In Crime
  • February 5, 2019
  • 206 Views
ప్రియుడిని కొట్టి…ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ప్రేమికులపై దాడి చేసిన కొందరు ప్రియుడు చూస్తుండగానే యువతిని లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. కాకినాడకు చెందిన యువకుడు శ్రీసిటీలోని ఓ మొబైల్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అక్కడ పనిచేసి, ప్రస్తుతం మరో కంపెనీలో పనిచేస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన యువతి, అతను ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆదివారం రాత్రి సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌కు కాస్త దూరంలో కూర్చొని ఉండగా నలుగురు యువకులు వారిని చుట్టుముట్టారు. యువకుడిపై దాడిచేసి, యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. బాధిత యువకుడు ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు. రాత్రి 10.25 గంటల సమయంలో ఎస్సై విశ్వనాథరెడ్డి, సిబ్బందితో కలిసి గస్తీ తిరుగుతూ యువకుణ్ని ఆరా తీశారు. అతనిచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమై యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. బలాత్కరించి.. రైలెక్కించారు: యువతిని లాక్కెళ్లిన యువకులు ఆమెను వాహనంలో తడ వైపు తీసుకెళ్లారు. తడ మండలం అక్కంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో వాహనం ఆపి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో యువతిని అక్కంపేట రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి సూళ్లూరుపేట వైపు వెళ్లే రైలు ఎక్కించారు. సూళ్లూరుపేట స్టేషన్లో దిగిన యువతి నేరుగా తాను ఉంటున్న గదికి వెళ్లింది. స్నేహితురాలి ఫోన్‌తో ప్రేమికుడితో మాట్లాడింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ కేసు నమోదు చేశామని, త్వరలో వారిని పట్టుకుంటామని గూడూరు డీఎస్పీ బాబూ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం రాత్రి నిందితుల్లో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos