రాణూ మండాల్‌పై విమర్శల వెల్లువ..

  • In Film
  • November 6, 2019
  • 149 Views
రాణూ మండాల్‌పై విమర్శల వెల్లువ..

రైల్వేస్టేషన్లో కూర్చొని పాటలు పాడుకుంటూ భిక్షాటన చేస్తున్న స్థాయి నుంచి బాలీవుడ్ గాయనిగా ఎదిగిన రాణు మండాల్ తీరుపై ప్రస్తుతం ప్రజలతో పాటు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబయిలోని ఓ షాపింగ్ మాల్ లో రేణూ మోండల్ ను చూసిన ఓ మహిళ ఆమె వద్దకు వచ్చింది. ఆమెతో సెల్ఫీ దిగాలని అనుకుంది. ఆమె భుజంపై చెయ్యి వేసి పిలిచింది. దీంతో రేణూ మోండల్ కు కోపం వచ్చేసింది. తన భుజంపై చెయ్యి ఎందుకు వేస్తున్నావంటూ ప్రశ్నించింది. తానిప్పుడు సెలబ్రిటీనని దూరంగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆమెపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘పాతరోజులని మర్చిపోయి ఆమె ప్రవర్తిస్తోన్న తీరు బాగోలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు పొగరు వచ్చిందని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos