రంగాను హతం చేసిన తెదేపా సర్కార్

రంగాను హతం చేసిన తెదేపా సర్కార్

గుంటూరు: వంగవీటి రంగను తెదేపా  ప్రభుత్వమే చంపించిందని వంగవీటి నరేంద్ర ఆరోపించారు. గురువారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడినందుకు  రంగాను ప్రభుత్వమే వ్యూహాత్మకంగా , దారుణంగా హతం చేసిందని తీవ్రమైన ఆరోపణ చేసారు. రంగా హత్యతో తెదేపాకు సంబంధం లేదని రాధా చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొంటారని ఆశించినట్లు చెప్పారు.  రాధా టీడీపీలో చేరడం వల్ల వ్యక్తి గతంగా ఆయన లాభం కలుగు తోందేమోనని వ్యాఖ్యానించారు. వంగవీటి రాధా తెదేపాలో చేరడం రంగా అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోందని నరేంద్ర అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో వంగవీటి రాధా బుధవారం రాత్రి  తెదేపాలో చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos