న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ మాధ్యమ విభాగ బాధ్యురాలు లోక్సభ మాజీ సభ్యులు, మాజీ నటి రమ్య అనే దివ్య స్పందన ప్రధాని మోదీ అభిమానుల సహనాన్ని తన దైన శైలిలో వరుసగా పరీక్షిస్తున్నారు. ‘మోదీ మద్దతుదార్లు ప్రతి ముగ్గురిలో ఒకరు తెలివి తక్కువ దద్దమ్మ అని, మి గిలిన ఇద్దరు కూడా అంతేన’ని చేసిన ట్వీట్ కమలనాధుల్ని ఆగ్రహ పరచింది. మోదీ ‘దొంగ’ అని రమ్య ఇంతకు ముందు ట్వీట్ పెద్ద దుమారాన్ని లేపింది. మోదీ కొత్తగా ప్రారంభించిన ‘మే బీ చౌకీదార్’ (నేను కూడా కాపలాదారుడిని) నినాదాన్ని ఎద్దేవా చేస్తూ రమ్య మరో ట్వీట్ చేసారు. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నిరవ్ మోదీ, అంబానీలకు మోదీ కాపాలాదారని హేళన చేసారు. కమలనాధుల ఆక్షేపణల్ని లెక్కించకుండా రమ్య వరుసగా ఎగతాళి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.