ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో తెలియదు, అసలు ఈమె హీరోయిన్ లా ఉందా అని కామెంట్ చేసిన వారే తమ సినిమాలే నువ్వే హీరోయిన్ గా ఉండాలి అని కోరి మరీ తీసుకున్న ఘటనలు ఉన్నాయి, నువ్వు నా పక్కన హీరోయిన్ గా ఏమి సెట్ అవుతావు అన్న కొందరు చివరకు ఆమె నా సినిమాలో ఉండాలి అని చెప్పిన వారు ఉన్నారు, అలాంటి ఓ హీరోయిన్ ని రిజక్ట్ చేసిన హీరోనే ఆమెని వివాహం చేసుకున్నాడు.ఈమె మన సినిమాలో హీరోయిన్ అని నిరోషాను పరిచయం చేయగానే హీరో రాంకీ నోరెళ్లబెట్టారు.. పనిమనిషిలా ఉంది అని అన్నారు. అయినా డైరెక్టర్ ఆమే హీరోయిన్ అని చెప్పారు.. ఆ తర్వాత ఆమెకి పలు అవకాశాలు వచ్చాయి, రాధిక చెల్లెలు నిరోషను చూసి సింధూరపువ్వులో అవకాశమిశ్చారు డైరెక్టర్ దేవరాజ్.1988లో తమిళంలో ప్రారంభమైన సింధూ పూవే చిత్రం తెలుగులో సింధూర పువ్వుగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. ఆమె హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.అయితే ఈ చిత్రం పూర్తీ అయ్యేసరికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళికి దారి తీసింది.తన పక్కన హీరోయిన్ గా కూడా పనికి రాదని భావించిన నిరాశనే జీవితాంతం తన పక్కన ఉండే స్థానం కల్పించాడు.