రాందేవ్‌పై అరెస్ట్‌ వారంట్‌

రాందేవ్‌పై అరెస్ట్‌ వారంట్‌

తిరువనంతపురం: ఓ క్రిమినల్‌ కేసులో కోర్టుకు గైర్హాజరైనందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు జారీచేశారని ఆరోపిస్తూ పతంజలి ఆయుర్వేదకు చెందిన దివ్య ఫార్మసీపై కేరళ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కేసు దాఖలు చేశారు. ఫిబ్రవరి 1న బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ కోర్టుకు హాజరు కావాలని పాలక్కాడ్‌ జిల్లా కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసింది. అయితే వారిద్దరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 15న వారిని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos