ప్చ్…వినయ విధేయ రామ

  • In Film
  • January 23, 2019
  • 179 Views
ప్చ్…వినయ విధేయ రామ

రణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే పండుగ సెలవుల కారణంగా 60 కోట్ల షేర్ మార్క్ ను అందుకోగలిగింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. దాంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడట. ఆ నష్టాన్ని కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో, నిర్మాత డీవీవీ దానయ్య 50 లక్షల వరకూ వెనక్కి ఇచ్చేశాడని తెలుస్తోంది. మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్లతో చర్చలు జరుపుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఊరట కలిగించే విషయమే. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos