చేసిన పాపాలు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో కడిగేసుకుంటా..

  • In Film
  • March 9, 2019
  • 168 Views
చేసిన పాపాలు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో కడిగేసుకుంటా..

గత పదిహేనేళ్ల కాలంగా ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్రాక్‌ రికార్డు ఏమంత బాగాలేదు.ఇంకా చెప్పాలంటే ఆర్జీవీ సినిమా అంటే ప్రేక్షకులతో పాటు సినీజనాల్లో కూడా ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది. అసలు ఆర్జీవీ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలియని దుస్థితికి ఆర్జీవీ ట్రాక్‌రికార్డు పడిపోయింది.ఈ తరుణంలో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవమానాలు,వెన్నుపోటు ఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం మాత్రం అనూహ్యమైన హైప్‌ సొంతం చేసుకుంది.లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం కోసం ఆర్జీవీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు,సినీ వర్గాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింహగర్జన పేరుతో చిత్రం ఫంక్షన్‌ నిర్వహించారు.కార్యక్రమంలో ఆర్జీవీ మాట్లాడుతూ.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామని కొందరు హెచ్చరిస్తుంటే టెలివిజన్‌ రౌడీలు నరికేస్తామంటూ బెదిరిస్తున్నారన్నారు.వాళ్ల బెదిరింపులకు బెదిరిపోనని వాళ్లు బెదిరిస్తే నేను కూడా బెదిరిస్తానంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.నా జీవితంలో చాలా పాపాలు చేశానని అందులో జీఎస్టీ సినిమా కూడా నేను చేసిన పాపాల్లో ఒకటన్నారు.వాటన్నింటిని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో కడిగేసుకుంటానని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తె తిరుపతికి వెళ్లి పాపాడు కడిగేసుకుంటున్నానని ఇకపై నిజాలు మాత్రమే చెబుతానన్నారు.ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం కోసం అగస్త్య కూడా ఎంతో పరిశోధన చేశాడని అందుకు దర్శకుడి టైటిల్‌లో తన పేరుతో పాటు అగస్త్య పేరు కూడా వేశామన్నారు.లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఔన్నత్యాన్ని ఏమాత్రం తగ్గించలేదన్నారు.70ఏళ్ల వరకు మహరాజులా బ్రతికిన ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానంలో మాత్రం వైస్రాయ్‌ హోటల్‌లో జరిగిన ఘట్టం అనంతరం చాలా మానసిక క్షోభకు గురయ్యారని కొంతమంది ఎన్టీఆర్‌ను దారుణంగా మోసం చేశారని వీటినే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో్ చూడబోతున్నారన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos