మన తెలుగు హీరోలు సినిమాలతో పాటు అప్పుడప్పుడు యాడ్స్‌లోనూ కనిపిస్తుంటారు. తాజాగా వారి జాబితాలో రామ్ కూడా చేరిపోయాడు. కెరీర్లో తొలిసారి కమర్షియల్ యాడ్‌లో నటించాడు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో కలిసి గార్నియర్ మేన్ షాంపు యాడ్‌లో నటించిన రామ్.. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో రామ్ హిందీలో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.అందుకు సంబంధించి ట్విట్టర్ లో అభిమానులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు.‘నేను నటించిన తొలి బ్రాండ్ ఎండార్స్‌మెంట్. గార్నియర్ మేన్‌తో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. ఈ యాడ్‌ను షూట్ చేసేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పడు ఫన్‌గా అనిపించింది. ఈ అసోసియేట్ మరింత కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. రామ్ తాజా చిత్రం ‘రెడ్’ విడుదలకు సిద్ధంగా ఉంది.